‘అర్జున్ రెడ్డి’ …. టీజర్

222
Arjun Reddy Official Teaser
- Advertisement -

‘వాలెంటైన్స్ డే’ సందర్భాన్ని పురస్కరించుకుని కొత్త సినిమాలకి సంబంధించిన సందడి మొదలైంది. ఆయా సినిమాలు ఫస్ట్‌ లుక్, టీజర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం  చేస్తున్నారు. తాజాగా ‘పెళ్లి చూపులు’ సినిమాతో ప్రేక్షకులకు బాగా దగ్గరైన విజయ్ దేవరకొండ సరికొత్త ట్రెండ్‌గా మారాడు. విజయ్ సినిమా  వస్తుందంటే చాలు, యూత్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఆయన తాజా చిత్రంగా ‘అర్జున్ రెడ్డి’ తెరకెక్కుతోంది. ‘వేలంటైన్స్ డే’ సందర్భంగా .. ఈ రోజున ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను వదిలారు.

హీరోగా విజయ్ దేవరకొండ పాత్రలోని విభిన్నమైన కోణాలను ఈ టీజర్ లో అద్భుతంగా చూపించారు. టీజర్‌తో అర్జున్‌ రెడ్డిపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ప్రణయ్ రెడ్డి నిర్మాణంలో సందీప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో, కథానాయికగా షాలిని అలరించనుంది.

- Advertisement -