విజయ్ దేవరకొండ, శాలిని పాండే హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం అర్జున్ రెడ్డి. ఈమూవీ ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించింది. ఈ సినిమాతో విజయ్ స్టార్ హీరో రేంజ్ కి వెళ్ళిపోయాడు. విజయ్ శాలిని పాండే జంటకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అప్పటి నుంచి ఈజోడిని మరోసారి తెరపై చూడాలిని ఆశపడుతున్నారు ప్రేక్షకులు. అయితే తాజాగా ఉన్న సమాచారం మేరకు ఈజోడి త్వరలోనే మరోసారి తెరపై కనిపించనున్నారని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ మూవీలో నటిస్తున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ సంస్ధ వారు నిర్మిస్తున్న ఈచిత్రంలో విజయ్ సరసస రష్మీక మందన హీరోయిన్ గా నటిస్తుంది. ఆ తర్వాత దర్శకుడు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ ఓ సినిమా చేయనున్నారు. త్వరలోనే ఈచిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఈమూవీ తర్వాత మరో దర్శకుడికి కూడా కమిట్ మెంట్ ఇచ్చాడు విజయ్. తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలైతో సెట్స్ పైకి వెళ్లనున్నాడు.
ఈసినిమా స్టోర్ట్స్ నేపథ్యంలో సాగనుందని సమాచారం. ఈమూవీలో హీరోయిన్ గా శాలిని పాండేను తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈవార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే. ‘అర్జున్ రెడ్డి’ జోడీ మరోసారి కలిసి నటించడం ఈ సినిమాను మరింత క్రేజీగా మారుస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.