అర్జున్ రెడ్డి…పెళ్ళి తర్వాత..!

561
Arjun Reddy After marriage..!
- Advertisement -

పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ.. ‘అర్జున్ రెడ్డి’తో భారీ క్రేజ్ సంపాదించాడు. యూత్‌ను ఆకట్టుకునే కంటెంట్‌తో భారీ హిట్ కొట్టి తనెంటో ఫ్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాపై ఎన్ని వివాదాలు చేలరేగిన ప్రేక్షకులు మాత్రం ఆదరించారు. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా సుమారు రూ.25 కోట్లు వసూలు చేసి నిర్మాతలకు లాభాల పంట పండించింది.

Arjun Reddy After marriage..!
ఇక ఈ సినిమాలో అర్జున్ రెడ్డి స్టైల్, బుల్లెట్ బైక్‌ యూత్‌ని విపరీతంగా ఆకట్టుకుంది. మాసిన గడ్డంతో అర్జున్ చెప్పిన డైలాగులకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అంతేగాదు చాలామంది యూత్ నిజజీవితంలో అర్జున్‌ రెడ్డి స్టైల్‌ను ఫాలో అవుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించి ఏ చిన్న వార్తైన సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

మూవీలో ఎంతోకష్టపడి హీరో..హీరోయిన్‌ను పెళ్లిచేసుకుంటాడు. ఈ నేపథ్యంలో పెళ్లి తర్వాత అర్జున్ రెడ్డి అంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో  చక్కర్లు కొడుతోంది.

- Advertisement -