అర్జెంటీనా అధ్యక్షుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 70 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులపై వేటు వేసేందుకు రెడీ అయ్యారు. దశల వారీగా ప్రభుత్వ ఉద్యోగులను తొలగించాలని ఆ దేశ అధ్యక్షుడు జావియెర్ మిలీ భావిస్తున్నారని బ్లూమ్ బర్గ్ నివేదిక వెల్లడించింది.
కొద్దిరోజుల్లో 70 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించాలని భావిస్తున్నారని, ఆర్థికంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకోనున్నారని తెలిపింది బ్లూమ్ బర్గ్.
ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల ఒప్పందం త్వరలోనే ముగియనుండగా వీరి కాంట్రాక్ట్‌ను రెన్యువల్ చేసే ఆలోచన తమకు లేదని జావియెర్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అర్జెంటీనాలో 35 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా ఇందులో 70 వేల మందిని ఒకేసారి తొలగించనుండగా దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
Also Read:కాల్షియం తగ్గిందా.. ఇవి తినండి!