నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే వివాదాల రాణి కంగనా రనౌత్ నేడు తన 36వ పుట్టిన రోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా గురువారం ఇన్ స్టా గ్రామ్ వేదికపైకి వచ్చిన కంగనా రనౌత్ ఓ ఇంట్రెస్టింగ్ వీడియోని పోస్ట్ చేసింది. గులాబీ రంగు అంచుతో ఉన్న ఆకుపచ్చని చీర ధరించిన కంగనా రనౌత్ మెరిసిపోతుంది. అలాగే తన వీడియోలో పలు షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చింది కంగనా. తనకు మద్దతుగా నిలిచిన తన తల్లిదండ్రులు, తనకు బోధించిన గురువులకు ధన్యవాదాలు అంటూ కంగనా స్పీచ్ మొదలెట్టింది.
ఆ తర్వాత తనను ద్వేషించే వారిని ఉద్దేశించి కంగనా రనౌత్ మాట్లాడుతూ.. తెలిసి తెలియక నేను ఎవరినైనా బాధ పెట్టి ఉంటే.. దయచేసి మన్నించాలి అంటూ కంగనా రనౌత్ కోరుకుంది. ఈ క్రమంలో కంగనా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ కంగనా ఏం మాట్లాడింది అంటే.. ‘‘నా శత్రువులు నన్ను విశ్రాంతి కూడా తీసుకోనివ్వకుండా చేశారు. నేను ఎంత విజయం సాధించానన్నది ముఖ్యం కాదు. కానీ, నన్ను నా పాదాలపై నిలుచుని, విజయ పథంలో నడిచేలా చేశారు అని కామెంట్స్ చేసింది.
కంగనా ఇంకా మాట్లాడుతూ.. ‘ఎలా పోరాడాలో నాకు న శత్రువులే నేర్పించారు. వారికి నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని’’ అని కంగనౌ రనౌత్ పోస్ట్ చేయడం గమనార్హం. ‘‘స్నేహితులారా నా సిద్ధాంతం చాలా సులభం. నా ప్రవర్తన, ఆలోచనలు చాలా సాధారణం. అందరికీ మంచి జరగాలనే నేను ఎప్పుడూ కోరుకుంటాను. దేశ సంక్షేమం కోసం మాట్లాడుతూ నేను ఎవరినైనా బాధ పెట్టి ఉంటే అలాంటి వారందరికీ క్షమాపణలు చెబుతున్నాను’’ అని కంగనా రనౌత్ చెప్పడం నిజంగా షాకింగే. అయితే, ఈ మధ్య కంగనా రనౌత్ సినిమాలు సరిగ్గా ఆడడం లేదు. అందుకే, కంగనా మార్పు వచ్చింది అంటున్నారు. మొత్తానికి ప్లాప్స్ తో హీరోయిన్ మారిపోయింది అన్నమాట.
ఇవి కూడా చదవండి..