చికెన్‌ తింటున్నారా..జాగ్రత్త!

44
- Advertisement -

మాంసాహార ప్రియులకు అత్యంత ఇష్టమైన ఆహార పదార్థాలలో చికెన్ ముందు వరుసలో ఉంటుంది. చికెన్ తో రకరకాల వంటకాలు చేసుకుంటూ కడుపు నిండా ఆరగిస్తూ ఉంటారు. మాంసాహార ప్రియులు వారానికి కనీసం ఒక్కసారైనా చికెన్ తినకుండా ఉండలేరు. ఇంకా చెప్పాలంటే రోజు తినేవారు కూడా లేకపోలేదు. చికెన్ తింటే మన శరీరానికి కావలసిన ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. అందుకే బలహీనంగా ఉన్నవారికి, బరువు తక్కువగా ఉన్నవారికి చికెన్ ఒక మంచి పౌష్టికాహారం. అయితే వారంలో ఒకటి లేదా రెండు చికెన్ తింటే పరవాలేదు గాని.. ప్రతిరోజూ చికెన్ తింటే అనారోగ్య సమస్యలు తలెత్తడం ఖాయం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రతిరోజూ ముక్క లేనిదే ముద్ద దిగని వాళ్ళు కచ్చితంగా చికెన్ విషయంలో జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు నిపుణులు. ప్రతిరోజూ చికెన్ తినడం వల్ల శరీరంలో అదనంగా చేరిన ప్రోటీన్.. వ్యర్థమైన కొవ్వు రూపంలోకి మారి అధికంగా బరువుకు దారి తీస్తుంది. సాధారణంగా చికెన్ పై సల్మోనెల్లా, క్యాంపిలోబక్టర్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. అందువల్ల చికెన్ ను గంటల తరబడి నిల్వ ఉంచరాదు. ఒకవేళ గంటల తరబడి నిల్వ ఉంచిన చికెన్ ను తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే వాంతులు, వీరోచనలకు దారి తీసే అవకాశం కూడా ఉంది. ఇంకా చికెన్ అతిగా ప్రతిరోజూ తినడం వల్ల క్యాన్సర్ ముప్పు కూడా పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read: PV Sindhu:పీవీ సింధు పెళ్లి తేదీ ఫిక్స్!

ఇంకా మార్కెట్ లో చికెన్ కొనుకునేటప్పుడు కూడా ఎన్నో జాగ్రత్తలు వహించాలని నిపుణులు చెబుతున్నారు. పెద్ద పెద్ద మార్కెట్ లలో చికెన్ అమ్మే సెంటర్ల అపరిశుభ్రత కారణంగా ” క్యాంఫీలో బ్యాక్టర్ ” అనే వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందట. ఇది జబ్బుల బారిన పడిన కోళ్ళలో అధికంగా ఉంటుందట. ఈ వైరస్ అత్యంత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి చికెన్ సెంటర్ల వద్ద మనం తీసుకునే చికెన్ ఫ్రెష్ గా ఉందో లేదో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నా మాట. ఇంకా అనారోగ్య కోళ్ళు నుంచి యాంటీ బయోటిక్స్ వల్ల మాక్రోబయర్ రెస్తిస్టెన్స్ అనే వ్యాధికి దారి తీస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల హెచ్చరించింది. కాబట్టి ప్రతిరోజూ చికెన్ తినే వాళ్ళు ఈ అలవాటు మార్చుకోవడం మంచిది. అంతే కాకుండా చికెన్ తీసుకునే ముందు అది తాజాగా ఉందా లేదా ? అని చెక్ చేసుకోవడం ఉత్తమం.

- Advertisement -