Sheetal:చరిత్ర సృష్టించిన ఆర్చర్ శీతల్‌

5
- Advertisement -

రెండు చేతులు లేకపోయినా.. చరిత్ర సృష్టించింది ఆర్చర్ శీతల్‌. సాధారణ ఆర్చర్లతో కలిసి ఆసియా కప్‌ పోటీలకు ఎంపికైంది. జెడ్డాలో ఆసియా కప్‌ స్టేజ్‌-3లో పోటీ పడే భారత జట్టులో చోటు దక్కించుకుంది శీతల్.

18 ఏళ్ల జమ్మూ-కాశ్మీర్‌కు చెందిన శీతల్.. భారత ఆర్చరీ చరిత్రలో సాధారణ (ఏబుల్-బాడీడ్) అంతర్జాతీయ టోర్నమెంట్‌లో పారా అథ్లెట్ పాల్గొనడం ఇదే తొలిసారి. సోనిపట్‌లో జరిగిన జాతీయ ఎంపిక ట్రయల్స్ ద్వారా ఆమె తన ప్రతిభను నిరూపించారు. 60 మందికి పైగా సాధారణ ఆర్చర్లతో పోటీపడుతూ, శీతల్ మొత్తం 703 పాయింట్లు సాధించి మూడవ స్థానంలో నిలిచారు. మొదటి రౌండ్‌లో 352, రెండవ రౌండ్‌లో 351 పాయింట్లు సాధించారు.

ట్రయల్స్‌లో తేజల్ సాల్వే 15.75 పాయింట్లతో మొదటి స్థానంలో నిలవగా, వైదేహి జాధవ్ 15 పాయింట్లతో రెండవ స్థానంలో, శీతల్ 11.75 పాయింట్లతో మూడవ స్థానంలో ముగించారు.

2024 పారిస్ పారా ఒలింపిక్స్‌లో మిక్స్‌డ్ టీమ్ విభాగంలో కాంస్య పతకం గెలుచుకుంది శీతల్. ఈ ఏడాది తొలిసారిగా ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్ సాధించి రికార్డు సృష్టించారు.

ఆసియా కప్ స్టేజ్ 3 కోసం భారత జట్టు:

మెన్స్ రికర్వ్: రాంపాల్ చౌదరి, రోహిత్ కుమార్, మయాంక్ కుమార్

వుమెన్స్ రికర్వ్: కొండపావులూరి యుక్తా శ్రీ, వైష్ణవి కులకర్ణి, కృతికా బిచ్‌పురియా

Also Read:Modi:జంగిల్ రాజ్‌తో ఖజానా లూటీ

మెన్స్ కంపౌండ్: ప్రధ్యుమన్ యాదవ్, వాసు యాదవ్, దేవాంశ్ సింగ్

వుమెన్స్ కంపౌండ్: తేజల్ సాల్వే, వైదేహి జాధవ్, శీతల్ దేవి

- Advertisement -