సీఎం రేవంత్‌ను కలిసిన చికిత తనిపర్తి

7
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు మహిళా ఆర్చరీ ఛాంపియన్ చికిత తనిపర్తి. కెనడాలో జరిగిన 2025 యూత్ వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున బంగారు పతకం గెలుచుకున్న తొలి మహిళగా రికార్డు సృష్టించింది చికిత.

చైనాలోని షాంఘైలో జరిగిన సీనియర్ వరల్డ్ కప్ జట్టు తరఫున రజత పతకం సాధించింది చికిత. ఈ మేరకు చికితను అభినందించారు సీఎం రేవంత్ రెడ్డి.

ఒలింపిక్స్‌లో పతకం సాధించేలా ప్రభుత్వం తరపున పూర్తి శిక్షణ అందించేందుకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు రేవంత్ రెడ్డి.

Also Read:మిరాయ్…పండగ లాంటి సినిమా

- Advertisement -