‘అరవింద సమేత’ నుండి రెడ్డెమ్మ తల్లి వీడియో సాంగ్‌..

294
Aravindha Sametha
- Advertisement -

ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అరవింద సమేత’ దసరా సీజన్‌లో విడుదలై వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ఈ సినిమాకు పోటీ లేకపోవడంతో పాటు వరస సెలవుల నేపథ్యంలో రాఘవ రెడ్డి జనాన్ని థియేటర్ల దాకా రప్పిస్తున్నాడు.ఇందులో చేప్పుకోవల్సిన విషయం ఏంటంటే..తమన్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సినిమాలో ఉన్న నాలుగు పాటలు ప్రేక్షకులను ఎంతగానో అకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ మూవీలోని పెంచలదాస్ రాసి పాడిన ‘రెడ్డెమ్మ తల్లి’ పాటను వదిలారు. ఊరికి ఉత్తరాన అంటూ సాగే పాటను కవర్ సాంగ్ పేరిట వీడియో రూపంలో విడుదల చేశారు. కేవలం రెండు నిముషాలు మాత్రమే ఉన్న ఈ పాట ప్రీ క్లైమాక్స్‌లో బసిరెడ్డి పాత్ర చనిపోయాక బ్యాక్ గ్రౌండ్‌లో వస్తుంది. ఈ పాట యుట్యూబ్‌లో అప్ లోడ్ చేసిన కొద్దీ నిమిషాలకే లక్షల వ్యూస్ కోసం పరుగులు పెట్టడం చూస్తే దీనికి ఎంత ఆదరణ దక్కిందో అర్థమవుతోంది.

- Advertisement -