‘అరవింద సమేత’ మేకింగ్‌ వీడియో..

409
Aravinda Sametha
- Advertisement -

ఎన్టీఆర్‌,పూజా హెగ్డే కథానాయిక హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్న మూవీ ‘అరవింద సమేత వీరరాఘవ’. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 65 లక్షల మందికిపైగా ఈ ట్రైలర్‌ చూశారు. ఇప్పటికీ ఇది యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో మొదటి స్థానంలో దూసుకుపోతుంది. అక్టోబరు 11న ఈ చిత్రాన్ని విడుదల కానుంది.

Aravinda Sametha

ఈ నేపథ్యంలో ఈ సినిమా మేకింగ్‌ వీడియోను ఈ రోజు వదిలారు. ‘‘అరవింద సమేత’ సెట్స్‌లో ఏం జరిగిందో చూడండి’ అని హారిక అండ్‌ హాసిని సంస్థ ట్వీట్‌ చేసింది. సినిమా షూటింగ్ చాలా సరదాగా జరిగినట్లు దీన్ని చూస్తే తెలుస్తోంది. ఈ సినిమాలో ఈషా రెబ్బా, సునీల్‌, జగపతిబాబు, రావు రమేశ్‌, సితార, బ్రహ్మాజీ, నవీన్‌ చంద్ర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పీసీ వినోద్‌ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తమన్‌ సంగీతం సమకూరుస్తున్నారు.

- Advertisement -