ఆడియో రిలీజ్‌కి డేట్‌ ఫిక్స్‌..

240
- Advertisement -

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ లేటెస్ట్ మూవీ ‘అరవింద సమేత’. డిఫెరెంట్‌ లుక్‌తో ఎన్టీఆర్ ఈ మూవీలో కనిపించి ఫ్యాన్స్‌ని ఫుల్‌ఖుష్ చేశాడు. పూజాహెగ్దే ఈ మూవీలో హీరోయిన్‌. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫ్యాక్షన్ తో ముడిపడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతోంది.

 Aravinda Sametha ఇక ప్రేక్షకులకు దసరా గిఫ్ట్‌ గా అక్టోబర్ 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనుంది చిత్రయూనిట్. అందుకు పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయి. అయితే ఈ క్రమంలోనే ఆడియో రిలీజ్ డేట్‌ ని చిత్రయూనిట్‌ ఫిక్స్‌ చేసినట్టు టాక్‌.

 Aravinda Sametha ఈ నెల 20వ తేదీన ఆడియో వేడుకను హైదరాబాద్ లోని ‘నోవాటెల్’ హోటల్లో నిర్వహించాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా సమాచారం. కానీ ఈ విషయమై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యానికి తమన్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. కాగా..ఇప్పటికే ఫ్యాన్స్‌ ఈ సినిమా ఆడియో రిలీజ్‌ కోసం ఫ్యాన్స్ తెగ ఎదుకుచూస్తున్నారు.

- Advertisement -