‘అంతఃపురం’ విడుదలకు ముహుర్తం ఖరారు..

30

తమిళ దర్శకుడు సుందర్.సి హర్రర్‌ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌. ‘అరణ్మనై’ టైటిల్‌తో ఆయన నుంచి వరుస సినిమాలు వస్తున్నాయి. అలా వచ్చిన ‘అరణ్మనై’ .. ‘అరణ్మనై 2’ భారీ విజయాలను అందుకున్నాయి. ఈ చిత్రాలు తెలుగులో ‘చంద్రకళ’ .. ‘కళావతి’ టైటిల్‌తో అనువాదమై తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఆ సినిమాలో సీక్వెల్‌గా తమిళంలో ‘అరణ్మనై 3’ సినిమా రూపొందింది.

ఆర్య – రాశి ఖన్నా జంటగా నటించిన ఈ సినిమాకి, తెలుగులో ‘అంతఃపురం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ, ఈ నెల 31వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఉదయనిధి స్టాలిన్ నిర్మించిన ఈ సినిమాలో, సుందర్‌తో పాటు ఖుష్బూ .. ఆండ్రియా .. సాక్షి అగర్వాల్ .. యోగిబాబు .. సంపత్ రాజ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.