ఘనంగా అరకు ఎంపీ ప్రేమ వివాహం…

876
araku mp goddeti madhavi
- Advertisement -

అరకు ఎంపీ,వైసీపీ నేత గొడ్డేటి మాధవి వివాహం ఘనంగా జరిగింది. ఇవాళ ఉదయం 3.15 గంటలకు మాధవి స్వగ్రామం శరభన్న పాలెంలో జరిగింది. ఆమె స్నేహితుడు,సెయింట్ థెరిసా కళాశాల కరస్పాండెంట్ కుసిరెడ్డి శివప్రసాద్‌తో జరుగగా పెద్ద ఎత్తున ఇరు కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ నేతలు హాజరయ్యారు.

మేళతాళాలు, రంగు రంగుల విద్యుత్‌ దీపాల నడుమ సంప్రదాయబద్ధంగా వివాహం జరిగింది. దీంతో మాధవి స్వగ్రామమైన కొయ్యూరు మండలం శరభన్నపాలెంలోనూ, ఇటు వరుడు శివప్రసాద్‌ స్వగ్రామం గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలో సందడి వాతావరణం నెలకొంది.

araku mp

మాజీ మంత్రి, వైసీపీ నేత దాడి వీరభద్రరావు, అరకు మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు, పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావు .ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌, ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణతో పాటు మాధవి తండ్రి,కమ్యూనిస్టు నేత,మాజీ ఎమ్మెల్యే దేముడు సన్నిహితులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.

- Advertisement -