రెహమాన్ కామెంట్స్‌..దుమారం

8
- Advertisement -

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్‌లో తనకు అవకాశాలు తగ్గడానికి మతతత్వం కూడా ఒక కారణమై ఉండొచ్చని రెహమాన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ, మత వర్గాల్లో విస్తృత చర్చకు దారి తీశాయి.

తాజాగా ఈ వ్యాఖ్యలపై వీహెచ్‌పీ (విశ్వ హిందూ పరిషత్) నేత వినోద్ బన్సల్ తీవ్రంగా స్పందించారు. రెహమాన్ ఆరోపణలను ఖండించిన ఆయన, బాలీవుడ్‌లో మతం ఆధారంగా వివక్ష లేదని వ్యాఖ్యానించారు. అంతేకాదు, రెహమాన్ తిరిగి హిందూ మతంలోకి రావాలని సూచిస్తూ చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి. వ్యక్తిగత విశ్వాసాలను ఇలా బహిరంగంగా ప్రశ్నించడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉండగా, ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ కూడా రెహమాన్ వ్యాఖ్యలను ఖండించారు. బాలీవుడ్‌లో అవకాశాలు ప్రతిభ, కష్టపాటు ఆధారంగానే లభిస్తాయని, మతానికి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. పలువురు నిర్మాతలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, రెహమాన్ లాంటి గొప్ప సంగీత దర్శకుడికి అవకాశాలు తగ్గాయన్న వాదనను అంగీకరించలేమని అన్నారు.

ఈ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. కొందరు రెహమాన్‌కు మద్దతుగా నిలుస్తుండగా, మరికొందరు ఆయన వ్యాఖ్యలు అనవసరమని విమర్శిస్తున్నారు. ఈ వివాదం బాలీవుడ్‌లో మతం, అవకాశాల అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది.

Also Read:టీమిండియా జట్టు కూర్పుపై కైఫ్!

- Advertisement -