ఏప్రిల్ 23..టైమ్‌లెస్ లవ్ సాంగ్

42
- Advertisement -

అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న తెలుగు-తమిళ ద్విభాషా ప్రాజెక్ట్ ‘కస్టడీ’ మే 12న థియేటర్లలో ప్రేక్షకులకు థ్రిల్ అందించడానికి సిద్ధంగా వుంది. ఈ సినిమా టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ రాగా, పోలీసుల గొప్పతనాన్ని తెలిపే ఫస్ట్ సింగిల్ సూపర్ హిట్ అయింది.

ఈరోజు ఈ సినిమా సెకండ్ సింగిల్‌కి సంబంధించిన అప్‌డేట్‌ని అందించారు మేకర్స్. టైమ్‌లెస్ లవ్ అనే పాటను ఈ నెల 23న విడుదల చేయనున్నారు. మాస్ట్రో ఇళయరాజా, అతని కుమారుడు యువన్ శంకర్ రాజా టైమ్‌లెస్ ట్రాక్‌ని స్కోర్ చేసారు. పోస్టర్ సూచించినట్లుగా, ఇది రెట్రో-స్టయిల్ నంబర్.

Also Read: ద్విభాషా చిత్రంగా..మళ్లీ పెళ్లి

పోస్టర్ నాగచైతన్య, కృతిశెట్టి క్లాసిక్ డ్యాన్సింగ్ ఫోజ్ లో రెట్రో దుస్తులలో కనిపించారు. చై టోపీ ఉన్న సూట్‌ను ధరించగా, కృతి శెట్టి స్లీవ్‌లెస్ గౌను స్పోర్టింగ్ బన్ హెయిర్‌డోలో ఆకట్టుకుంది.

Also Read: పిక్ టాక్ : కుర్ర హృదయాల్లో విస్ఫోటనం

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై భారీ నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని పవన్‌కుమార్‌ సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్‌ఆర్‌ కతీర్‌ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రానికి రాజీవ్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌, డివై సత్యనారాయణ ఆర్ట్‌ డైరెక్టర్‌.

- Advertisement -