సెప్టెంబర్ 2, 2019 నుండి సెప్టెంబర్ 12, 2019 వరకు 11 రోజుల పాటు నిర్వహించనున్న వినాయక చవితి ఉత్సవాలలో ఏర్పాటయ్యే మండపాలలో LT తాత్కాలిక విద్యుత్ కనెక్షన్ల మంజూరుకు TSSPDCL సంస్థ తమ ఆపరేషన్ సర్కిళ్ల సూపెరింటెండింగ్ ఇంజినీర్లకు పలు ఆదేశాలు జారీచేసింది.
విద్యుత్ సరఫరా కోసం మండప నిర్వాహకులు ముందుగా క్రింద నిర్దేశించబడిన రుసుమును చెల్లించాలని సంస్థ కోరుతున్నది. గణేష్ విగ్రహాలు ప్రతిష్టించే మండపాలలో విద్యుత్ టారిఫ్ ఈ క్రింది విధంగా ఉంటుంది
1. 250 వాట్ల వినియోగానికి – రూ. 500/-
2. 250 వాట్ల నుంచి 500 వాట్ల వినియోగానికి – రూ. 1000/-
3. 500 వాట్ల నుంచి 1000 వాట్ల వినియోగానికి – రూ. 1500/-
ఆపైన వినియోగించే ప్రతి 500 వాట్లకుగాని,
భాగానికి గాని రూ. 750/- చెల్లించాలి
ఒక వేళ దరఖాస్తుదారులు మీటర్డ్ విద్యుత్ సరఫరా కోరినచో, అమలులోనున్న నిబంధనల ప్రకారము యల్.టి. తాత్కాలిక సరఫరా ఇవ్వబడుతుంది. టారిఫ్ ఆర్డర్ 2018 – 19 నిబంధనల ననుసరించి తాత్కాలిక సరఫరా కేటగిరి ప్రకారం టారిఫ్ రూ.11.00 ప్రతి యూనిట్ కు మరియు రూ. 21/కివా/నెల చొప్పున ఫిక్సుడ్ ఛార్జి వాసులు చేయబడుతుంది .
విద్యుత్ తీగలకు కొండీలు తగిలించి విద్యుత్ సరఫరా పొదండం నేరం మరియు అపాయకరం అన్నారు సిఎండి రఘుమా రెడ్డి. విద్యుత్ ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది గనుక స్థానిక విద్యుత్ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో గణేష్ మండపాల నిర్వాహకులను సంప్రదించి అనుమతి లేకుండా విద్యుత్ సరఫరా పొందటం ఎంత ప్రమాదకరమో వారికి తెలియజేసి విద్యుత్ కనెక్షన్ పొందేవిధంగా పోత్సహించాలని సీఎండీ ఆపరేషన్ సూపెరింటెండింగ్ ఇంజినీర్లను ఆదేశించారు గణేష్ మండప నిర్వాహకులు తమ మండపాలలో విద్యుత్ వినియోగనికై విధిగా కనెక్షన్లను తీసుకోని గణేష్ ఉత్సవాలను సురక్షాపూర్వక వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలన్నారు.