యాపిల్‌లో కొత్త మోడల్స్‌ వచ్చేశాయ్‌…

291
Apple launches 3 new iphones
- Advertisement -

స్మార్ట్ ఫోన్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐఫోన్ ఎక్స్ వచ్చేసింది. యాపిల్‌ సరికొత్త ఐఫోన్‌ టెన్‌ను మంగళవారం కాలిఫోర్నియాలోని స్టీవ్ జాబ్స్ థియేటర్ లో ఆవిష్కరించబడింది. పదేళ్ల క్రితం అప్పటి ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) స్టీవ్‌ జాబ్స్‌ తొలి ఐఫోన్‌ను ఆవిష్కరించగా, దశమ వార్షికోత్సవ కానుకగా సరికొత్త, వినూత్న ఫీచర్లతో తీర్చిదిద్దిన ఐఫోన్‌ టెన్‌ (ఎక్స్‌)ను సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి టిమ్‌ కుక్‌ ఇక్కడ ప్రదర్శించారు.. యాపిల్‌ కొత్తగా నెలకొల్పిన యాపిల్‌ పార్క్‌ ‘స్పేస్‌షిప్‌’ ఆవరణలోని స్టీవ్‌జాబ్స్‌ థియేటర్‌లో నూతన ఆవిష్కరణల కార్యక్రమం అట్టహాసంగా, ఆనందోత్సాహాల మధ్య జరిగింది. ఈ ఫోన్‌ అమెరికా సహా కొన్ని విపణుల్లో నవంబరు 3 నుంచి లభ్యమవుతుంది. భారత విపణిలోకి ఎప్పుడొచ్చేదీ కంపెనీ ప్రకటించలేదు. ఐఫోన్ 8తోపాటు ఐఫోన్ 8ప్లస్‌ కూడా విడుదల చేయనున్నట్టు సమాచారం.

Apple launches 3 new iphones

ఇప్పటివరకు ఫోన్లను అన్‌లాక్‌ చేయాలంటే చేతి వేలిముద్ర, లేదా బటన్‌ వినియోగించగా, ఐఫోన్‌ టెన్‌ మాత్రం యజమాని ఫోన్‌ను తన ముఖానికి ఎదురుగా ఉంచుకుని, కళ్లతో చూడటం ద్వారా అన్‌లాక్‌ అవుతుంది. వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ కూడా దీని ప్రత్యేకతే. దీంతోపాటు ఐఫోన్‌ 7, ఐఫోన్‌ 7ప్లస్‌ను మెరుగుపరచి రూపొందించిన ఐఫోన్‌ 8, ఐఫోన్‌ 8ప్లస్‌లను కూడా విడుదల చేశారు. వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సదుపాయం ఈ ఫోన్లకు ఉంది. 5.8 అంగుళాల తెర, అత్యధిక స్పష్టత కోసం హై రిజొల్యూషన్‌ డిస్‌ప్లే, 3డీ సెన్సార్లు, 3డీ స్కానర్‌ సాయంతో ముఖాకృతితో అనిమొజి రూపొందించే సదుపాయం, 12 మెగా పిక్సెల్‌ డ్యూయల్‌ కెమేరాలు, 64 జీబీ నుంచి ప్రారంభమయ్యే ఐఫోన్‌ టెన్‌ ధర 999 డాలర్లుగా నిర్ణయించారు. 256 జీబీ వరకు మోడళ్లు ఉన్నాయి. ఐఫోన్‌ ఎస్‌ఈ, 6ఎస్‌, 7 మోడళ్ల ధరలను తగ్గించారు. దీని ప్రభావంతో మన మార్కెట్లోను రేట్లు తగ్గే అవకాశం ఉంది.

Apple launches 3 new iphones

ఐఫోన్‌ 8, ఐఫోన్‌ 8 ప్లస్‌ వీటి తెరలకు గ్లాస్‌ అమర్చారు. సిల్వర్‌, గ్రే, రోజ్‌గోల్డ్‌ రంగుల్లో రూపొందించారు. ఐఫోన్‌ 8కు 4.7 అంగుళాల తెర, ఐఫోన్‌ 8ప్లస్‌కు 5.5 అంగుళాల తెర ఉన్నాయి. ఐఫోన్‌ 8కు 12 మెగాపిక్సెల్‌ కెమేరా ఉంటే, ఐఫోన్‌ 8 ప్లస్‌కు డ్యూయల్‌ కెమేరా అమర్చారు. 64 జీబీ మెమొరీ కలిగిన ఐఫోన్‌ 8 మోడల్‌ 699 డాలర్లు కాగా, ఐఫోన్‌ 8 ప్లస్‌ ధర 799 డాలర్లు. 256 జీబీ మెమొరీ కలిగిన మోడళ్లూ ఉన్నాయి. ఐఓఎస్‌ 11ను ఈనెల 19న ఆవిష్కరిస్తారు.ఈ ఫోన్లకు ఈనెల 15 నుంచి ముందస్తు బుకింగ్‌ చేసుకుంటే, 22 నుంచి సరఫరా చేస్తారు.

https://youtu.be/K4wEI5zhHB0

https://youtu.be/k0DN-BZrM4o

- Advertisement -