48 గంటలు సముద్రంలో నానినా.. పని చేసిన ఐఫోన్7

223
iphone_7
- Advertisement -

సాధారణంగా ఫోన్ నీళ్లలో పడిందంటే.. ఆ ఫోన్ పనిచేయదని ఇంకో ఫోన్ కొనుకుంటాం. కొంచెం ఖరీదైన ఫోన్ అయితే.. సర్వీస్ సెంటర్ కి వెళ్లి బాగు చేయించుకుంటాం. అది నీళ్లలో పడిన వెంటనే తీస్తేనే పని చేసే అవకాశం ఉంటుంది. గంటల కొద్ది పడిదంటే ఆశలు వదులుకోవాల్సిందే. కానీ ఓ వ్యక్తి ఫోన్ సముద్రంలో పడి 48 గంటల పాటు ఉన్నా.. పని చేస్తూనే ఉంది.

Sea diver

వివరాల్లోకి వెళితే.. కెనడాకు చెందిన ఓ వ్యక్తి పొరపాటున తన ఐఫోన్7 ఫోన్ ని ఇంగ్లండ్ లోని డోర్డల్ డోర్ సముద్రంలో పడేసుకున్నాడు. ఎంత ప్రయత్నించినా దొరకలేదు. ఇక దొరకదని భావించి వెళ్లిపోయాడు. 48 గంటల పాటు నీటిలో ఉండిపోయింది ఆ ఫోన్. రెండు రోజుల తరువాత యూకేకి చెందిన స్కూబా డైవర్ సిరీస్ హర్సీ అనే యువతి అదే ప్రాంతంలో డైవింగ్ చేస్తూ వెళ్లింది. డైవింగ్ చేస్తున్న ఆమెకు ఓ చిన్నపాటి మెరుపు కనిపించింది. ఏంటా అని వెళ్లి చూడగా.. ఐఫోన్ 7 ఉంది.

ఆ ఫోన్ ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. సముద్రంలో పడిఉన్నా ఇంకా పని చేస్తుందని, 84% చార్జింగ్ ఉందన చెప్పింది. ఆ ఫోన్ కి మెసేజ్ వచ్చినప్పుడు చిన్నపాటి మెరుపు చూసి దగ్గరికి వెళ్లానని తెలిపింది. అనంతరం ఆ ఫోన్ ను కెనెడియన్ కి ఇచ్చేసింది. వాటర్ రెసిస్టెన్స్ ఐపీ 67 రేటింగ్ ను కలిగివుండటమే ఫోన్ ను కాపాడిందని ‘డిజిటైమ్స్’ పేర్కొంది.

- Advertisement -