ఏపీలో జరగబోయే వచ్చే ఎన్నిల్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతుందా ? అసలు ఏపీలో హంగ్ ఏర్పడడానికి అవకాశం ఉందా ? ఒకవేళ హంగ్ ఏర్పడితే ఎవరికి లాభం ?.. ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ఏపీ పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. వచ్చే ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందని ఏపీ బీజేపీ నేతలు చెబుతున్నారు. ఏ పార్టీకి కూడా స్పష్టమైన ఆధిక్యం రాదని అందువల్ల హంగ్ ఏర్పడుతుందని ఏపీ బీజేపీ నేత సిఎం రమేష్ ఇటీవల వ్యాఖ్యానించారు. దాంతో నిజంగానే హంగ్ కు అవకాశం ఉందా ? అనే సమాధానం చెప్పడం కష్టమే. ఎందుకంటే ప్రస్తుతం ప్రధాన పార్టీల నేతలందరు గెలుపు విషయంలో ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అధికర వైసీపీ ఏకంగా 175 స్థానాల్లో విజయం తథ్యం అని చెబుతుంటే మరోవైపు టీడీపీ 160 పక్కా అని చేబుఃతోంది. ఇంకోవైపు జనసేన కూడా అధికారం మాదే అని చెబుతోంది. కాగా విశ్లేషకులు చెబుతున్నా దాని ప్రకారం వాస్తవాలు మాట్లాడుకుంటే.. అధికార వైసీపీ ఆశిస్తున్నట్లుగా 175 కష్టమేనని, ఇంకా గట్టిగా చెప్పాలంటే గత ఎన్నికల్లో గెలిచిన 151 స్థానాల్లో కూడా విజయం కష్టమే అనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం జగన్ ప్రభుత్వంపై ఏర్పడిన వ్యతిరేకత దృష్ట్యా అటు ఇటుగా 70-80 స్థానాలు రావడమే గగనం అనే రీతిలో విశ్లేషకులు చెబుతున్నారు. ఇక టీడీపీ విషయానికొస్తే ఈసారి ఎన్నికల్లో గతంతో పోలిస్తే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా.
60-80 స్థానాల్లో టీడీపీ సత్తా చాటిన ఆశ్చర్యం లేదనేది కొందరు చెబుతున్నా మాట. ఇక జనసేన కూడా ఈసారి గట్టిగా సత్తా చాటే అవకాశం ఉంది 10 నుంచి 30 సీట్ల వరకు జనసేన ప్రభావం గట్టిగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఏ పార్టీకి కూడా స్పష్టమైన ఆధిక్యం కనబరిచే అవకాశం లేదనేది కొందరి మాట. అయితే టీడీపీ జనసేన పొత్తు కుదిరే అవకాశం ఉన్నందున ఈ రెండు పార్టీలు కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేకపోలేదు. ఇక ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ.. కూటమికి సై అంటే టీడీపీ జనసేన గెలుపులో బీజేపీ భాగం కూడా ఉండే అవకాశం ఉంది. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వం దృష్ట్యా ఏపీలో హాట్ హాట్ డిబేట్లు జరుగుతున్నాయి.
ఇవి కూడా చదవండి…