చంద్రులకు పువ్వులు పెట్టిన ఉమా భారతి..

328
Apex council meet on water sharing
Apex council meet on water sharing
- Advertisement -

ఢిల్లీలో కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన అపెక్స్ కౌన్సిల్ సమావేశం ప్రారంభంమైంది. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల అంశంపై చర్చిచేందుకు అపెక్స్‌ కౌన్సిల్‌ దిల్లీలో సమావేశమైంది. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు హాజరయ్యారు. ఈ సమావేశంలో వాదనలు వినిపించేందుకు రెండు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. అయితే ముఖ్యమంత్రులిద్దరు ఉమాభారతి వద్దకు వెళ్లిన సమయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఉమాభారతికి అభివందనం చేస్తూ, కేసీఆర్ గులాబీలతో కూడిన పుష్పగుచ్ఛాన్ని ఆమెకు ఇచ్చారు.

apex-tsap

చిరునవ్వుతో దాన్ని తీసుకున్న ఉమాభారతి, అప్పటికే అక్కడికి చేరుకున్న చంద్రబాబును కేసీఆర్ కు చూపించగా, ఇద్దరు నేతలూ కరచాలనం చేసుకున్నారు. ఆ వెంటనే కేసీఆర్ తనకిచ్చిన గులాబీ ఫ్లవర్ బొకే నుంచి ఓ పువ్వును లాగి ఆమె చంద్రబాబుకు ఇచ్చారు. ఆపై మరో పువ్వును లాగి కేసీఆర్ చేతిలోనూ పెట్టారు. ఈ ఘటనను అక్కడున్న మంత్రులు దేవినేని ఉమ, హరీశ్ రావు ఇతర అధికారులు చిరునవ్వుతో తిలకించారు. కాగా ఈ సమావేశానికి తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, చంద్రబాబుతో పాటు ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రులు, ఇంజినీర్లు హాజరయ్యారు. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో సమావేశం కొనసాగుతోంది. కృష్ణా నదీ జలాలకు సంబంధించి ఇరు రాష్ర్టాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నాయి.

- Advertisement -