గ్రాండ్‌గా అపర్ణ సినిమాస్ ఈవెంట్

28
- Advertisement -

సక్సెస్ ఫుల్ కన్స్ట్రక్షన్ సంస్థ అపర్ణ కన్స్ట్రక్షన్స్ సినిమాస్ లోకి అడుగుపెట్టింది. ప్రేక్షకులు లార్జర్ దెన్ లైఫ్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించేలా మోడరన్ టెక్నాలజీ, అద్భుతమైన యాంబియన్స్, వరల్డ్ క్లాస్ ప్రొజెక్షన్, సౌండ్ సిస్టమ్, సిట్టింగ్, లగ్జరీ సదుపాయలతో అపర్ణ సినిమాస్ మల్టీ ప్లెక్స్ ని గ్రాండ్ గా లాంచ్ చేసింది. ఘనంగా జరిగిన ఈవెంట్ లో అపర్ణ సినిమాస్ లోగోని లాంచ్ చేశారు.

అపర్ణ సినిమాస్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ లో అపర్ణ కన్స్ట్రక్షన్ & ఆపరేషన్స్ హెడ్ రామ కృష్ణ మాట్లాడుతూ.. 2010లో నల్లగండ్లలో ఏమీ వుండేది కాదు. అ రోజుల్లోనే సిటీలో అతి పెద్ద గ్రేటెడ్ కమ్యూనిటీ అపర్ణ సరోవర్ ని కట్టి ఇవ్వడం జరిగింది. ఇది నిర్మించినప్పుడే మా కస్టమర్స్ కి మల్టీ ఫ్లెక్స్, మాల్ రాబోతుందని చెప్పాం. ఆ ప్రామిస్ పూర్తి చేయడానికి అపర్ణ సినిమాస్ కట్టడం జరిగింది. అపర్ణ ఏది చేసినా ది బెస్ట్ గా వుంటుంది. మాల్, సినిమాస్ కూడా ది బెస్ట్. ఎన్వీ ప్రసాద్ గారి సలహాలతో అపర్ణ సినిమాస్ లోకి రావడం జరిగింది. ఎక్కడా రాజీపడకుండా అత్యద్భుతంగా మల్టిప్లెక్స్ ని కట్టాం. యాంబియన్స్. ప్రొజక్షన్, సౌండ్, సిట్టింగ్, కంట్రోల్ టెంపరేచర్, లాబీ, రెస్ట్ రూమ్స్ ఇలా అనీ ఆధునాతన టెక్నాలజీతో నిర్మించడం జరిగింది. అలాగే సినిమాతో పాటు మంచి ఫుడ్ ని కూడా ఆస్వాదించే ఏర్పాటు చేయడం జరిగింది. అపర్ణ సినిమాస్ ప్రేక్షకులు గొప్ప సినిమాటిక్ అనుభూతిని పంచుతుంది’ అన్నారు

నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ..అపర్ణ సంస్థల ఓనర్, నేను స్నేహితులం. తను ఏదైనా ది బెస్ట్ కోరుకుంటారు. ఎక్కడా రాజీపడడు. ఈ మాల్ లో కొత్త స్పెషాలిటీ అండర్ గ్రౌండ్ లో రెండు కార్లు ఒకేసారి వెళ్ళొచ్చు, రావచ్చు. ది బెస్ట్ సౌండ్ సిస్టమ్ సిట్టింగ్ ప్రొజెక్షన్ వుంది. సినిమాతో పాటు ఫుడ్ కూడా రిజినబుల్ ధరల్లోనే వుంటాయి. అపర్ణ ప్రపంచవ్యాప్తంగా ఓ మంచి బ్రాండ్. సినిమాస్ లో ది బెస్ట్ గా వుండేలా అద్భతంగా నిర్మించారు. మే31 నుంచి అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఇది ఇండియాలోనే ఒక ప్రైడ్ మాల్ అవుతుంది. ప్రేక్షకులు గొప్ప అనుభూతితో సినిమా చూసి వెళ్తారు. అపర్ణ సంస్థ సినిమాస్ లోకి రావడం సినిమాలకి శుభపరిణామం. కొత్త బ్రాండ్ లాంచ్ అయ్యింది. భవిష్యత్ లో మరిన్ని థియేటర్స్ లో వస్తాయి. ఇండియాలోనే అపర్ణ సినిమాస్ బెస్ట్ మాల్ అవుతుందని కోరుకుంటున్నాను” అన్నారు.

Also Read:నటనకు నిర్వచనం…ఎన్టీఆర్

- Advertisement -