అపార్ కార్డ్‌..జీవితకాల ఐడీ!

2
- Advertisement -

దేశవ్యాప్తంగా ఒకే విద్యా విధానం నేపథ్యంలో విద్యార్థులకు ఆధార్ కార్డు తరహాలో అపార్ (Automated Permanent Academic Account Registry – APAAR)కార్డును తీసుకురానుంది కేంద్రం. వన్‌ నేషన్‌- వన్‌ ఐడీ పేరుతో 17 అంకెలుండే ఈ కార్డులు కేజీ నుండి పీజీ వరకు చదివే విద్యార్థులకు ఇవ్వనున్నారు.

విద్యార్థులకు ఈ గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రక్రియను త్వ‌రిత‌గ‌తిన ప్రారంభించాలని అన్ని రాష్ట్రాలు, యూటీలను కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది. అయితే అపార్ కార్డులో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పేర్లను, చిరునామాలు అక్షర దోషాలు లేకుండా సమర్పించాలి. దీనితో వారు మీ సేవ చుట్టు తిరుగుతున్నారు.

ఆపార్ కార్డ్ బాధ్య‌త‌ను నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరంకు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. ఆధార్‌తో అనుసంధానం చేసిన ఈ ప్రత్యేక సంఖ్యను నమోదుచేస్తే చాలు.. విద్యార్థి కుటుంబ వివరాలు, మార్కుల సర్టిఫికేట్లు తదితర వివరాలన్నీతెలుసుకోవ‌చ్చు. ప్రవేశ పరీక్షల దరఖాస్తుల్లోనూ ఈ సంఖ్యను నమోదుచేస్తే సరిపోతుంది.

విద్యార్థి ఎల్‌కేజీలో చేరినప్పటి నుంచి విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు.. అన్ని వివ‌రాలు ఇందులో ఉండనున్నాయి. పూర్తివివరాలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు వీలుగా ఈ కార్డు ఉపయోగ‌ప‌డేలా చేయ‌నుంది కేందం. ఈ అపార్‌ నెంబర్‌నే విద్యార్థి జీవితకాల ఐడీగా ప‌రిగ‌ణించ‌నున్నారు.

Also Read:మహా శివరాత్రికి ప్రత్యేక బస్సులు

- Advertisement -