వాలంటీర్ వార్’.. ఎవరికి నష్టం!

19
- Advertisement -

ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. మరి ముఖ్యంగా ఈ నెల ప్రారంభం నుంచి ఈ వార్ తారస్థాయికి చేరుతోంది. ప్రతి నెల వాలెంటిర్ల ద్వారా లబ్ధిదారులకు పెన్షన్ అందేదీ కానీ పెన్షన్ పంపిణీలో వాలెంటిర్లు పాల్గొనరాదని ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో అసలు సమస్య మొదలైంది. ఇలా జరగడానికి ప్రధాన కారణం టీడీపీ అధినేత చంద్రబాబే అని వైసీపీ.. కాదు కాదు ప్రభుత్వం వద్ద బడ్జెట్ లోటు కారణంగానే పెన్షన్ వాయిదా పడిందనేది టీడీపీ వర్గం ఒక ఒకరిపై ఒకరు విమర్శల దాడి చేసుకుంటున్నారు. ఓవరాల్ గా చూస్తే వాలంటీర్ వ్యవస్థ విషయంలో ఎన్నికల ముందు హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వ పనులకు దూరం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా వాలెంటిర్ల మూకుమ్మడి రాజీనామాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. .

వాలంటీర్ల వ్యవస్థకు టీడీపీ వ్యతిరేకమని అందుకే ఆ వ్యవస్థపై చంద్రబాబు ఈసీకి ఫిర్యాదు చేశారని వాలెంటిర్లు చెబుతున్నారు. మరోసారి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకున్న తరువాతే వాలెంటిర్లుగా కొనసాగుతామని చెబుతున్నారు. నిజానికి వాలెంటీర్ ఉద్యోగాలకు ఎలాంటి చట్టబద్దత లేదు అందువల్ల ఎన్నికల ప్రచారల్లోనూ, పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లోనూ వారు పాల్గొంటే చట్టవిరుద్దమే అవుతుంది, పైగా ఓటర్లను ప్రభావితం చేసేలా వాలంటీర్లు ఇంటింటి ప్రచారం చేస్తున్నారనే విమర్శ కూడా చాలా రోజుల నుంచి వినిపిస్తోంది. అందుకే వాలెంటిర్లు వైసీపీ ప్రతినిధుల్లా పని చేయరాదని టీడీపీ చెబుతోంది.

అయితే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలు ప్రజలకు నేరుగా అందుతుండడంతో తాము అధికారంలోకి వచ్చిన వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అయినప్పటికి ప్రస్తుతం వాలెంటిర్లు మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ రాజీనామాల వెనుక వైసీపీ హస్తం ఉందా ? లేదా చంద్రబాబుపై నమ్మకం లేక వాలెంటిర్లు రాజీనామా చేస్తున్నారా ? అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ప్రధానంగా వాలెంటిర్లలో వ్యతిరేకత ఏర్పడడం టీడీపీకే నష్టం అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నా మాట. అందుకే ప్రస్తుతం ఈ వ్యవస్థపై ఏర్పడ్డ అనిశ్చితిని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఎన్నికల్లో వాలెంటిర్ల మద్దతు ఎవరివైపు ఉంటుందో చూడాలి.

Also Read:KTR:రైతుల బాధ కనిపించడంలేదా?

- Advertisement -