ప్రజలకు నచ్చిన లీడర్‌…కేటీఆర్:ఏపీ టీఆర్ఎస్ అధ్యక్షుడు

289
ktr
- Advertisement -

వేల కిలో మీటర్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతో ప్రారంభమవుతుందన్నట్టే నూరేళ్ల జీవితమనే ప్రయాణం కూడా పసి ప్రాయంలో నాన్న వేలుపట్టుకొని నడవడంతోనే ప్రారంభమవుతుంది. చిన్న తనం నుంచి తండ్రిని అనుకరించి… అనుసరించి… ఆయన స్థానంలో కూర్చుకునేందుకు కూడా ఆర్హుడని అనిపించుకున్నారు. ఆయనే తెలంగాణ రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు.

1976, జూలై 24న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, శోభ దంపతులకు జన్మించాడు కల్వకుంట్ల తారక రామారావు. నాలుదు దశాబ్ధాలుగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్న కేసీఆర్ ను చూసి స్ఫూర్తి పొందేవారు కేటీఆర్. నాన్నంటే కేటీఆర్ కు ఎనలేని గౌరవం. చిన్న తనం నుంచి ఆయనతో నేరగా మాట్లాడాలంటే జంకేవరంట కేటీఆర్.కేటీఆర్ విద్యాభ్యాసం పూర్తయ్యాక ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడే ఉద్యోగం చేస్తూ స్థిరపడ్డారు.

ఇలాంటి సమయంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. తండ్రి సారథ్యం వహిస్తున్న ఉద్యమానికి తనవంతు ఊతం ఇవ్వాలన్న తపనతో 2006లో స్వదేశానికి తిరిగి వచ్చారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొంటూ తండ్రికి చేదోడు వాదేడుగా ఉంటూ వస్తున్నారు.

2009, 2014, 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించి తండ్రి కాబినేట్ లో మంత్రిగా పని చేస్తున్నారు. తండ్రి చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటిస్తూ కార్యనిర్వహణ అధ్యక్షునిగా పార్టీని విజయ తీరాలకు చేరుస్తున్నారు. పరిపాలనలో తండ్రికి అండగా నిలుస్తున్నారు.

ఒకప్పుడు ఆంధ్రప్రాంత్ర లీడర్ల ఇస్తేనే తీసుకునే ఎంపీ, ఎమ్మెల్యేల సీట్లను, నేడు ఎపీ వాళ్లకు కూడా తెలంగాణలో ఒక్క సీటును కేటాయించాలనే స్థితి తీసుకువచ్చిన లీడర్ కల్వకుంట్ల తారక రామారావు.

యువతకు రోల్ మోడల్!
తండ్రికి ప్రితీపాత్రుడు!!
ప్రజలకు నచ్చిన లీడర్!
తెలుగు ప్రజలకు దిక్సూచి!!
అభివృద్ధే లక్ష్యం అహర్నిశలు ముందుకుసాగుతున్న కేటీఆర్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు అని తెలిపారు ఏపీ టీఆర్ఎస్ అధ్యక్షుడు కొణిజేటి ఆదినారాయణ.

- Advertisement -