AP: ఇంటి ముంగిటకే కారవాన్!

11
- Advertisement -

ఏపీ టూరిజంలో మరో కీలక ముందడుగు పడింది. సందర్శనీయ ప్రాంతాలకు ఇక రయ్ రయ్‌గా వెళ్లవచ్చు. బెడ్, టీవీ సౌకర్యంతో కారవాన్ లోపలి భాగం సుందరంగా ముస్తాబుచేయగా పర్యాటక రంగంలో వినూత్న ప్రయోగం చేపట్టింది.

ప్రైవేట్ ఆపరేటర్లకు ప్రోత్సాహక రాయితీలు ఇవ్వనుండగా త్వరలో మార్గదర్శకాలు ఇవ్వనుంది ప్రభుత్వం. వాహనాలో ప్రత్యేకతలు, 2-6 మందికి సరిపడా పడకలు, గ్యాస్ స్టవ్, ఇండక్షన్ కుక్కర్ ,ఫ్రిజ్ ఉండనున్నాయి. అలాగే మైక్రోవేవ్ ఓవెన్, తాగునీటి ట్యాంక్, సింక్, బాత్ రూమ్, టాయిలెట్,చిన్న పరిమాణంలో షవర్, వాష్ బేసిన్,ఎయిర్ కండిషనర్, హీటర్, డైనింగ్, వై-ఫై, టెలివిజన్,జీపీఎస్ ట్రాకింగ్, అగ్నిమాపక పరికరాలు, ప్రాథమిక చికిత్స కిట్ ఉంటాయి.

తొలుత ప్రారంభించే మార్గాలు..విశాఖపట్నం-అరకు,విశాఖపట్నం-లంబసింగి,విజయవాడ-గండికోట,విజయవాడ-సూర్యలంక బీచ్,విజయవాడ-నాగార్జునసాగర్, విజయవాడ-శ్రీశైలం,విజయవాడ- తిరుపతి మధ్య ప్రారంభించనున్నారు.

Also Read:Kantara:రూ.200 కోట్లకు చేరువలో!

- Advertisement -