ఏపీలో మూడు రాజధానులు..అసెంబ్లీలో సీఎం జగన్

452
Jagan
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పుపై గత కొద్ది చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అమరావతి నుంచి రాజధాని మారుస్తారనే ఉహగానాలు వెలువడ్డాయి. ఇక ఏపీ రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి జగన్. ఏపీలో అభివృద్ది వికేంద్రీకరణ అవసరం ఉందని ఆయన అసెంబ్లీలో పేర్కొన్నారు. ఏపీలో సౌతాఫ్రికా మోడల్ తరహాలో 3 రాజధానులు ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు చెప్పారు.

అమరావతిలో చట్టసభలు, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్,కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయవచ్చని అన్నారు. వారం రోజుల్లో నిపుణుల కమిటీ నివేదిక వస్తుందని.. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ నివేదికలు తయారు చేసే బాధ్యత రెండు సంస్థలకు అప్పగించామని, ఆయా నివేదికలు వచ్చిన తర్వాత సుదీర్ఘంగా తాము ఆలోచన చేసి ఓ మంచి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. త్వరలో రాజధానిపై నిర్ణయం తీసుకుంటామని’ జగన్ వెల్లడించారు.

- Advertisement -