ఏపీలో రిషికొండ వ్యవహారం తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. గతంలో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ఉన్న విశాఖ రిషికొండ ప్రస్తుతం జగన్ హయంలో పూర్తిగా దాని రూపునే కోల్పోయింది. తవ్వకాల పేరుతో రిషికొండ చుట్టూ జగన్ సర్కార్ చేస్తున్న మైనింగ్ పై ప్రత్యర్థి పార్టీలు తరచూ విమర్శలు గుప్పిస్తున్నప్పటికి జగన్ సర్కార్ మాత్రం తవ్వకాలను ఆపడంలేదు. అసలు రిషికొండపై ఎందుకు తవ్వకాలు జరుపుతున్నారనే దానిపై కూడా ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు జగన్ సర్కార్. పర్యాటక ప్రదేశంగా ఉన్న రిషికొండలో జరుగుతున్నా తవ్వకాలపై అటు కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఓ కన్నెశాయి. అయితే ఎన్ని విమర్శలు, ఎన్ని ఇబ్బందులు వస్తున్నప్పటికి తవ్వకాలను మాత్రం ఆపడం లేదు.
జగన్ రిషికొండ పై జరుపుతున్న మైనింగ్ ద్వారా కోట్లు కూడగట్టుకుంటున్నారనే విమర్శలు నానాటికీ పెరుగుతూ వస్తున్నాయి. దానికి తోడు రిషికొండను చూడడానికి గాని అక్కడ తిరగడానికి గాని ఎవరికి పర్మిషన్ ఇవ్వడం లేదు జగన్ సర్కార్. దీంతో అసలు రిషికొండలో ఏం జరుగుతుందనేది పెద్ద మిస్టరీగానే ఉంది. అయితే తాజాగా రిషికొండ తవ్వకాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రిషికొండ వద్ద సిఎం కార్యలయం నిర్మిస్తున్నట్లు అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొండింది. అయితే వెంటనే ఆ పోస్ట్ ను డిలీట్ చేస్తూ ఋషికొండ పై సెక్రటేరియట్ నిర్మాణాలు కాదని పొరపాటున ఆ పోస్ట్ పెట్టడం జరిగిందని, అక్కడ టూరిజం శాఖకు సంబందించిన నిర్మాణాలు జరుగుతున్నాయని మళ్ళీ ఓ పోస్ట్ ను వైసీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
Also Read:గోపాల్ కృష్ణ గోఖలే…దేశం కోసమే జీవితం అంకితం
దీనికి టీడీపీ ఘాటుగా రీప్లే ఇస్తూ ” ఎన్ని కవర్ డ్రైవ్ లు కొట్టిన ఇవ్వాల్సిన మెసేజ్ ఇచ్చేశావని టీడీపీ ట్విట్టర్ లో వ్యంగ్యస్త్రాలు సంధించింది. ఇకపోతే విశాఖ నుంచి పాలన సాగిస్తామని వైఎస్ జగన్ గత కొన్నాళ్లుగా చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అన్నీ అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ లో జగన్ విశాఖకు షిఫ్ట్ అయ్యి అక్కడి నుంచి పాలన సాగిస్తారని వైసీపీ నేతలు ఘంటాపథంగా చెబుతూ వచ్చారు. కానీ సెప్టెంబర్ నాటికి సెక్రటేరియట్ నిర్మాణాలు పూర్తి అయ్యే అవకాశాలు లేనందువల్లే విశాఖా నుంచి పాలన సాగించే విధానాన్ని ప్రస్తుతం హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. మొత్తానికి గత కొన్నాళ్లుగా ఋషికొండపై జరుపుతున్న తవ్వకాలు సెక్రటేరియట్ కోసమని తాజాగా వైసీపీ పొరపాటున చేసిన ట్వీట్ తో స్పష్టమైంది.
Also Read:లోకమాన్య..బాలగంగాధర్ తిలక్
ఎన్ని కవర్ డ్రైవులు కొట్టినా ఇవ్వాల్సిన మెసేజ్ ఇచ్చేసావు!
థాంక్స్ బ్రో! 😂 https://t.co/LYAzBQZR31— Telugu Desam Party (@JaiTDP) August 13, 2023