జిల్లాల్లో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత కల్పింస్తున్నారని మంత్రులు, శాసన సభా స్పీకర్ పేర్కొన్నారు. సీతంపేటలో ఐటిడిఎ 77 సర్వసభ్య సమావేశం హాజరైన సందర్భంగా వారు మాట్లాడారు. ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డికి గిరిజనులతో ఎనలేని ప్రేమని అభివర్ణించారు. ముందుగా జిల్లాల పునర్వి భజన పైరెవిన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ ముఖ్య మంత్రి తీసుకున్న బలప రుస్తూ తీర్మానం చేయగా స్పీకర్ తమ్మినేని, మంత్రి సిధిరి అప్పల రాజు, జిల్లాకు చెందిన శాసన సభ్యు లు దానిని ఆమోదిస్తూ తీర్మానం చేశారు. ఈ సమావేశంలో అల్లూరి సీతారాం పేరుతో పాటు గిరిజనుల కోసం రెండు జిల్లాలు కేటాయిస్తూ ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవడం అభినందించ తగ్గ విషయమన్నారు.
సమావేశంలో ఎమ్మెల్సీ మాధవన్ మాట్లాడుతూ ప్రభుత్వం డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు మంజూరు చేస్తున్నాయి తప్ప వాటికి టీచింగ్ స్టాప్, నియమించడం లేదని అరోపించగా మంత్రి సీధిరి అప్పలరాజు ఖండించారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కొత్తగా కళాశాలలు మంజూరు చేసినా పూర్తి స్థాయిలో బోధనా ఇతర సిబ్బందిని నియమిస్తూ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. అటువంటివి గత ప్రభుత్వ హయంలో జరిగేవని ఎద్దేవా చేశారు.
ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ మాట్లాడుతూ బొంతు ప్రాంతంలో తాగు నీటి సమస్య ఉందని, దానిని పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. అధికారులు గిరిజన ప్రాంతం అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ఉపాధి హామీ బిల్లులు దశల వారీగా చెల్లింపుజరుగుతోందని ఆయన పేర్కొ న్నారు. ఐటిడిఎ పరిధిలో అన్ని గ్రామాలకు రహదారులతో అనుసంధానం చేయాలని రాష్ట్ర శాసన సభా స్పీకర్ తమ్మినేని సీతారామ్ కోరారు.