ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారం ప్రోఫైల్ ఇదే..

417
tammineni seetharam profile
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ శాసనసభకు రెండవ స్పీకర్ గా తమ్మినేని సీతారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తమ్మినేని సీతారం ఇప్పటి వరకూ 6సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడు సార్లు మంత్రిగా కూడా పనిచేశారు. ఇక ఆయన తెలుగుదేశం పార్టీలో రాజకీయంగా ఎంట్రీ ఇచ్చారు. 1983 లో తెలుగుదేశం పార్టీ మొదటిసారిగా శాసనసభకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009లో తెలుగు దేశం పార్టీని వీడి చిరంజీవి స్ధాపించిన ప్రజారాజ్యంలో చేరారు.

అ ఎన్నికల్లో అయన ఓటమిపాలు అయ్యారు . ఆ తర్వాత 2014ఎన్నికలకు ముందు ఆయన వైయస్సార్ సీపీ లో చేరారు. 2014ఎన్నికల్లో ఆయన బావమరిది రవికుమార్ చేతిలో ఓటమిపాలయ్యారు. 1994 లో న్యాయశాఖ మంత్రిగా . 1995 మున్సిపల్ , పట్టణ అభివృద్ధి శాఖ మంత్రిగా ,1999 లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసారు. ప్రస్తుతం అయన శ్రీకాకుళం జిల్లా అముదవలస నుండి ఎమెల్యేగా గెలిచి స్పీకర్ గా ఎన్నిక అయ్యారు.

- Advertisement -