పోయిన సారి గెలిచి జగన్ ఏం చేశాడు? రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అని దుయ్యబట్టారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ప్రభుత్వం ఎక్కడైనా పొరపాట్లు చేస్తే ఎత్తిచూపాల్సిన బాధ్యత ప్రతిపక్షంది… సభకు వచ్చి ప్రజాసమస్యలపై మాట్లాడి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి అన్నారు.
ఎన్నికల్లో ఓడిపోతే రప్పా రప్పా అని మాట్లాడాలా… ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న ఎవరూ అలా మాట్లాడరు అన్నారు. రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో గెలుపోటములు సహజం… ఇందిరా గాంధీ, ఎన్టీఆర్ లాంటి మహా నాయకులే ఓడిపోయారు అన్నారు.
ఇక అంతకముందు ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో అదనపు సముదాయం ప్రారంభించారు స్పీకర్ అయ్యన్న. అందుబాటులో 14 వేల చదరపు అడుగుల వర్క్ స్పేస్.. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైంది అన్నారు. సముదాయాలను అందుబాటులోకి తెచ్చాం.. రూ.5 కోట్లు అంచనా వ్యయం అనుకుంటే రూ.3 కోట్లతోనే పూర్తి చేశాం అన్నారు.
Also Read:శ్రీవారి సన్నిధిలో రాధాకృష్ణన్

