- Advertisement -
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డు మూడో సమావేశం జరిగింది. 15 ప్రాజెక్టులకు సంబంధించి పెట్టుబడులకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకోనుంది SIPB.
సమావేశంలో రూ. 44,776 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు 20 వేల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంది.ఒప్పందాలపై పరిశ్రమల యాజమాన్యాలతో నిరంతర చర్చల ద్వారా సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యేలా చూడాలన్నారు సీఎం చంద్రబాబు.
తీవ్ర పోటీ నెలకొన్న నేటి పరిస్థితుల్లో ఫలితాలు రావాలంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేసి చూపాలని అధికారులకు చంద్రబాబు సూచించారు.పెట్టుబడులపై దిగ్గజ సంస్థల నుంచి, జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల నుంచి వస్తున్న స్పందన సంతృప్తికరంగా ఉందని అభిప్రాయపడ్డారు చంద్రబాబు.
Also Read:కాంగ్రెస్ సోషల్ మీడియా..ఎంత పనిచేసింది!
- Advertisement -