- Advertisement -
ఆంధ్రప్రదేశ్లో ఆదివారం మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అదనపు మార్గదర్శకాలు జారీ చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని స్పష్టం చేసింది. జనరేటర్లు, ఇన్వెర్టర్లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ, సీసీ కెమెరాల ద్వారా చిత్రీకరించాలని ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియ ఫుటేజిని ఎన్నికల రికార్డుగా భద్రపరచాలని ఈసీ స్పష్టం చేశారు. 10 కంటే తక్కువ మెజారిటీ ఉన్నప్పుడే రీకౌంటింగ్ కు అనుమతించాలని తెలిపింది. రాత్రి 8 గంటలకల్లా కౌంటింగ్ ప్రక్రియ ముగించేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
- Advertisement -