ఏపీలో కొత్తగా 481 కరోనా కేసులు..

148
- Advertisement -

ఏపీలో గడచిన 24 గంటల్లో 39,604 కరోనా పరీక్షలు నిర్వహించగా, 481 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అదే సమయంలో 385 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒక మరణం సంభవించింది. రాష్ట్రంలో ఇప్పటిదాకా 20,65,716 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 20,46,512 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,837 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,367కి పెరిగింది.

రాష్ట్రంలో కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసులలో ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 157 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 76, కృష్ణా జిల్లాలో 52, గుంటూరు జిల్లాలో 39, విశాఖ జిల్లాలో 38 కేసులు వెలుగు చూశాయి. అత్యల్పంగా అనంతపురం జిల్లాలో 6 పాజిటివ్ కేసులు గుర్తించారు.

- Advertisement -