ఏపీలో 2,918 కొత్త కేసులు నమోదు..

75
ap corona

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతూ వస్తోంది.. తాజాగా విడుదలైన కరోనా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో 2,918 కొత్త కేసులు వచ్చాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 468 పాజిటిట్ కేసులు రాగా, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 44 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే సమయంలో ఏపీలో 24 మంది మృతి చెందారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 6,453కి పెరిగింది. తాజాగా 4,303 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,86,050కి చేరుకుంది. 7,44,532 మందికి కరోనా నయం కాగా, ఇంకా 35,065 మంది చికిత్స పొందుతున్నారు.అయితే ప్రస్తుతం కరోనా రికవరీ రేటు బాగా పెరుగుతోందని, రోజు రోజుకీ యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతోందని ఆరోగ్య శాఖ వెల్లడించింది.