AP:రాజకీయ పార్టీలకు భూమి..లీజు కాలం పెంపు

4
- Advertisement -

ఏపీలో రాజకీయ పార్టీలకు భూమి కేటాయింపు లీజు కాలం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబు సర్కార్. 33 ఏళ్ల కాలం లీజు 66 ఏళ్లకు పెంచుతూ సవరణ జీవో విడుదల చేసింది.

ప్రభుత్వం ఇదివరకు జారీచేసిన జీవో (http://G.O.Ms.No.575, తేదీ 08.12.2017) ప్రకారం ప్రతి మండల ప్రధాన కేంద్రంలో జాతీయ / గుర్తింపు పొందిన రాష్ట్ర రాజకీయ పార్టీలకు వారి వద్ద సొంత భవనం లేదా భూమి లేని పక్షంలో 0.30 ఎకరాలు (30 సెంట్లు) ప్రభుత్వ భూమిని లీజ్‌పై కేటాయించే విధానం అమలులో ఉంది.

తాజా సవరణ (http://G.O.Ms.No.411):లీజ్ కాలాన్ని 33 సంవత్సరాల నుండి 66 సంవత్సరాలకు పెంచారు. పార్టీ కొనసాగినంత వరకు మొత్తం 99 సంవత్సరాల వరకు పునరుద్ధరణ చేసుకోవచ్చు.

Also Read:పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్ ఆధిక్యం

- Advertisement -