ఎంపీ సంతోష్‌కు ఏపీ రైతుల కృతజ్ఞతాపూర్వక లేఖ..

275
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌కు ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ రైతుల కృతజ్ఞతాపూర్వక లేఖ రాశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మా నర్సరీల జీవితాలలో నవవసంతం నింపిందని సంతోషం వ్యక్తం చేశారు కడియం నర్సరీ నిర్వాహకులు.

అతి సామాన్య విషయం సైతం ప్రముఖుల ముఖత:వస్తే,దానికి వచ్చే ప్రాచుర్యం వేరు. ఈ సూత్రాన్ని అసాధారణ విషయమైన మొక్కల సంరక్షణ వంటి అంశానికి అనుసంధానం చేసి ప్రముఖులతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ముందుకు తీసుకువెళుతూ ప్రత్యుపకారం కోరని ప్రకృతిలా,పచ్చని మనసుతో ఈ మహాయజ్ఞానికి మీరు నాటిన సంకల్పం అనే విత్తనం. ప్రకృతితో మమేకమైన మనుషులలో ఆ ప్రకృతి పట్ల అవగాహనను నింపడమే గాక,మా నర్సరీ జీవితాలలో కూడా నవ వసంతం నింపిందని తెలియజేయుటకు మిక్కిలి సంతోషిస్తూ,ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పర్యావరణ కాలుష్యానికి పెను సవాలుగా నిలిచి పూర్తి స్థాయిలో సాధించే హరిత భారతావనికి అంకురార్పణ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు కడియం నర్సరీ రైతులు.

- Advertisement -