మాట నెరవేర్చిన లోకేష్

7
- Advertisement -

ఇచ్చిన మాటను నెరవేర్చారు ఏపీ మంత్రి నారా లోకేష్. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మా గ్రామానికి మొబైల్ సిగ్నల్స్ లేవు సెల్ టవర్ వేయించండి అంటూ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం కొట్టాలపల్లి గ్రామానికి చెందిన హారికృష్ణ అనే అతను ట్విట్టర్ లో పోస్ట్ చేయగా స్పందించారు లోకేష్.

ఇచ్చిన మాట ప్రకారం కడప జిల్లా, జమ్మలమడుగు మండలం, గండికోటకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొట్టాలపల్లి గ్రామానికి BSNL సెల్ టవర్ నిర్మించి ఆ గ్రామానికి మొబైల్ సిగ్నల్ అందేలా చేశారు. దీంతో ఆ గ్రామస్తులందరు లోకేష్ కి ధన్యవాదాలు తెలుపుతున్నారు.

Also Read:విద్యార్ధులకు భోజనం కూడా పెట్టలేరా?:కేటీఆర్

- Advertisement -