ఏపీసీసీ చీఫ్ షర్మిలపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన ఇద్దరు కాంగ్రెస్ నేతలకు ఏపీసీసీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు సుంకర పద్మశ్రీ, రాకేశ్ రెడ్డిలు వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ లింగంశెట్టి ఈశ్వరరావు ఆదేశించారు.
ఏపీ ఏఐసీసీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేసినందుకు గానూ పీసీసీ ఈ ఇద్దరికి నోటీసులు జారీ చేసింది. మీడియా సమక్షంలో తీవ్రమైన ఆరోపణలు చేశారని, పార్టీ ప్రతిష్ఠకు, నాయకత్వానికి నష్టం కలిగించారని నోటీసుల్లో పేర్కొన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి షర్మిల ఒంటెద్దు పోకడలే కారణమని వీరిద్దరూ ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల్లో సమర్థులైన నేతలకు టికెట్లు ఇవ్వలేదని విమర్శించారు. డబ్బులు ఇచ్చిన వారికే బీఫామ్ కేటాయించారని చెప్పగా దీనిపై అధిష్టానానికి సైతం ఫిర్యాదు చేశారు షర్మిల.
Also Read:పేక మేడలు…ఫస్ట్ సింగిల్