ఏపీ స్పీకర్‌గా తమ్మినేని..

409
ap speaker
- Advertisement -

సీఎంగా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుంచి పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్న జగన్‌ కేబినెట్ విస్తరణలోనూ సంచలనం సృష్టించారు. దేశచరిత్రలో ఇప్పటివరకు లేని విధంగా కేబినెట్‌లో ఏకంగా ఐదుగురుకి డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. అంతేగాదు తొలిదశలోనే పూర్తిస్థాయి మంత్రివర్గం 25 మందితో కొలువుదీరనుందని తెలిపారు.అలాగే రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని, కొత్తవారికి కేబినెట్‌లో అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

ఇక ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ ఎవరనేదానిపై సస్పెన్స్ వీడింది. స్పీకర్‌గా మాజీ మంత్రి,సీనియర్ ఎమ్మెల్యే తమ్మినేని సీతారంను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. బీసీ(కళింగ) సామాజిక వర్గానికి చెందిన సీతారం..జగన్‌తో భేటీ కావడంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లైంది.

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన తమ్మినేని ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1985లో ప్రభుత్వ విప్‌గా, 1994లో చంద్రబాబు కేబినెట్‌లో మున్సిపల్‌ శాఖ మంత్రిగా సీతారాం సేవలందించారు.

- Advertisement -