ఏపీలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు..

80
jagan
- Advertisement -

ఈరోజు ఏపీలో కొత్త‌గ మంత్రివర్గం కొలువుదీరింది. అయితే కొత్తగా నియామకం అయిన మంత్రుల‌కు శాఖ‌ల‌ను కేటాయిస్తూ ప్ర‌భుత్వం తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ ఉత్త‌ర్వుల ప్ర‌కారం ఆయా మంత్రులు, వారికి కేటాయించిన శాఖలు ఇలా ఉన్నాయి.

– జోగి ర‌మేశ్: గృహ నిర్మాణ శాఖ‌
– గుమ్మ‌నూరు: జ‌య‌రాం కార్మిక శాఖ‌
– ఉష‌శ్రీ చ‌ర‌ణ్: మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌
– పీడిక రాజ‌న్న దొర: గిరిజ‌న సంక్షేమం
– సీదిరి అప్ప‌ల‌రాజు: ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ‌
– దాడిశెట్టి రాజా: రోడ్డు, భ‌వ‌నాల శాఖ‌
– ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు: రెవెన్యూ శాఖ‌
– మేరుగ నాగార్జున: సాంఘీక సంక్షేమ శాఖ‌
– కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి: వ్య‌వ‌సాయ శాఖ‌
– నారాయ‌ణ స్వామి: ఎక్సైజ్ శాఖ‌
– అంజాద్ బాషా: మైనారిటీ సంక్షేమం
– పినిపే విశ్వ‌రూప్: ర‌వాణా శాఖ‌
– విడ‌ద‌ల ర‌జ‌ని: వైద‌,ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ‌
– బూడి ముత్యాల‌నాయుడు: పంచాయ‌తీరాజ్‌
– బొత్స స‌త్య‌నారాయ‌ణ: విద్యా శాఖ‌
– బుగ్గ‌న రాజేంద్రనాథ్ రెడ్డి: ఆర్థిక శాఖ‌
– అంబ‌టి రాంబాబు: జ‌ల‌వ‌న‌రుల శాఖ‌
– ఆర్కే రోజా: ప‌ర్యాట‌క శాఖ‌
– ఆదిమూల‌పు సురేశ్: పుర‌పాల‌క శాఖ‌
– తానేటి వ‌నిత: హోం శాఖ‌
– చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ: బీసీ సంక్షేమం
– కారుమూరి నాగేశ్వ‌ర‌రావు: పౌర స‌ర‌ఫ‌రాల శాఖ‌
– కొట్టు స‌త్య‌నారాయ‌ణ: దేవ‌దాయ శాఖ‌
– పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి: గ‌నుల శాఖ‌
– గుడివాడ అమ‌ర్‌నాథ్: ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ శాఖ‌

- Advertisement -