ఏపీ ఎమ్మెల్సీ స్థానాల షెడ్యూల్ రిలీజ్..

8
- Advertisement -

ఏపీ ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తికి షెడ్యూల్‌ని రిలీజ్ చేసింది ఎన్నికల సంఘం. దేశంలోని నాలుగు రాష్ట్రాల పరిధిలో ఖాళీగా ఉన్న ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జులై 12న ఉప ఎన్నిక నిర్వహించనున్నారు.ఏపీలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలతో పాటు… కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బిహార్లలో ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి.

ఏపీలో వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన రామచంద్రయ్య,మాజీ ఐపీఎస్ అధికారి షేక్ మహ్మద్ ఇక్బాల్ ఇద్దరూ ఆ పార్టీకి రాజీనామా చేయగా వీరిపై అనర్హత వేటు పడింది. దీంతో ఖాళీ అయిన ఈ రెండు స్థానాల భర్తీకి షెడ్యూల్ రిలీజ్ కాగా 25న 25న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ రెండు స్థానాలు కూటమి ఖాతాలోకి వెళ్లనున్నాయి.

Also Read:Revanth:రుణమాఫీ డేట్ ఫిక్స్!

- Advertisement -