ఏపీలో వచ్చే సాధారణ ఎన్నికల్లో విజయంపై వైసీపీ చూపిన కాన్ఫిడెన్స్ ఏ రేంజ్ లో ఉండిందో అందరం చూశాం. ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నామని, వచ్చే ఎన్నికల్లోనే కాదు మరో 30 ఏళ్ల వరకు వైసీపీ సర్కారే ఉంటుందని వైఎస్ జగన్ మరియు, పార్టీ నేతలు బల్ల గుద్ది చెబుతూ వచ్చారు. తద్వార విజయం నల్లేరు మీద నడకే అని అందువల్ల తమ టార్గెట్ కేవలం విజయం మాత్రమే కాదని 175 స్థానాలను కైవసం చేసుకోవడమే అని జగన్ పదే పదే చెబుతూ వచ్చారు. కట్ చేస్తే ఎమ్మెల్సీ ఎన్నికలు వైసీపీకి గట్టి షాక్ ఇచ్చాయనే చెప్పాలి. వైసీపీకి బలమైన మూడు స్థానాల్లోనూ టీడీపీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకొని.. వైసీపీకి కోలుకోలేని దెబ్బ తీసింది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ ఇలా అన్నీ ప్రాంతాల్లోనూ టీడీపీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు.
ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే జగన్ సొంత జిల్లా కంచుకోటగా భావించే పులివెందులలో ( పశ్చిమ రాయలసీమ ) కూడా టీడీపీ బలపరిచిన భూమా రాంగోపాల్ రెడ్డి గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి వెన్నుపూస రవీంద్ర రెడ్డిపై 7,553 ఓట్ల మెజారిటీతో రాంగోపాల్ రెడ్డి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నారు. దీన్ని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ కు సొంత నియోజిక వర్గంలో కూడా వ్యతిరేకత తప్పదా అనే వాదన నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ విజయం సాధించాలని, అదికూడా చంద్రబాబు సొంత నియోజిక వర్గం కుప్పంతోనే తమ విజయం మొదలు కావాలని భావించిన జగన్ కు ఇప్పుడు సొంత నియోజికవర్గం ( పులివెందుల ) నుంచే వ్యతిరేక గాలి విస్తోంది.
సాధారణ ఎన్నికల్లో కూడా ఇదే సీన్ రిపీట్ అయితే మాత్రం వైఎస్ జగన్ కంచుకోట బద్దలవ్వడం ఖాయమని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. అయితే జగన్ వచ్చే ఎన్నికల్లో కూడా పులివెందుల నుంచే పోటీ చేస్తాడా లేదా ఇంకేదైన నియోజిక వర్గాన్ని ఎంచుకుంటాడా అనే దానిపై కూడా ఎలాంటి స్పష్టత లేదు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో జగన్ పోటీ చేస్తే స్థానాల పేర్లలో జమ్ములమడుగు పేరు కూడా వినిపించింది. మరి ప్రస్తుతం పులివెందులలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు జగన్ ను అంతర్మథనానికి గురి చేశాయనే చెప్పాలి. దాంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పులివెందులలో జగన్ కు మెజారిటీ తగ్గే అవకాశం కూడా లేకపోలేదు. మొత్తానికి పులివెందుల ఇచ్చిన స్ట్రోక్ తో వై నాట్ కుప్పం అనే ఆలోచనలో ఉన్న జగన్.. ఇప్పుడు వాట్ నెక్స్ట్ పులివెందుల అనే డైలమా లోకి వెళ్లరాని పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..