గ్రీన్ ఛాలెంజ్‌లో ఏపీ ఎమ్మెల్సీ దువ్వాడ

22
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్, హరితసేన లో భాగంగా మొక్కలు నాటారు ఆంధ్రప్రదేశ్ MLC దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి. ఈ సందర్భంగా MLC దువ్వాడ శ్రీనివాస్ , మాధురి మాట్లాడుతూ మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ హరితసేనలో భాగంగా మూడు వేప మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉంది అన్నారు.

మంచి ఆక్సీజన్ కావాలన్న, ప్రకృతి వైపరిత్యాలు జరగకుండా ఉండాలన్న ప్రతీ ఒక్కరు మూడు మొక్కలు నాటాలి అన్నారు. మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించే భాద్యత కూడా మనమే చేపట్టాలి అన్నారు.ఓజోన్ పొర దెబ్బతినడం, విపరీతమైన ఎండలు తగ్గాలంటే 140 కోట్ల భారతీయులు ఒక్కక్కరు మూడు మొక్కలు నాటాల్సిన అవసరం ఉంది అన్నారు. డిఫారెస్టేషన్ ఫారెస్టేషన్ కావాలి అందరు ఏకమై మొక్కలు నాటాలి అన్నారు.

Also Read:దొంగను దొంగలాగే చూస్తారు:రేవంత్‌కు కేటీఆర్ చురక

ఈ కార్యక్రమాన్ని ఒక మహా యజ్ఞం లా ముందుకు తీసుకెళ్తున్న జోగినపల్లి సంతోష్ కుమార్ కి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వకుళ సిల్క్ సిబ్బంది అందరూ మూడు మొక్కలు నాటి ఫోటోలు పంపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో హరితసేన రాష్ట్ర కోర్డినేటర్ గర్రెపల్లి సతీష్ పాల్గొన్నారు.

- Advertisement -