ఓటమి బాటలో ఏపీ మంత్రులు..

12
- Advertisement -

ఏపీలో టీడీపీ కూటమి స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతోంది.ఇక పులివెందులలో జగన్ లీడ్‌లో ఉండగా ఏపీ మంత్రులు అంద‌రూ వెనుకంజ‌లో ఉన్నారు. అంబ‌టి రాంబాబు, రోజా, అమ‌ర్‌నాథ్‌, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, చెల్ల‌బోయిన వేణు, జోగి ర‌మేశ్ తో పాటు ప‌లువురు ఓట‌మి బాట‌లో ఉన్నారు.

ఇక పులివెందులలో జగన్ హవా కనిపిస్తోంది. మాజీ మంత్రి, వైసీసీ గుడివాడ అభ్య‌ర్థి కొడాలి నాని కూడా వెనుకంజ‌లో ఉన్నారు. నానిపై టీడీపీ అభ్య‌ర్థి వెనిగండ్ల రాము ఆధిక్యంలో ఉన్నారు. పిఠాపురంలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌, కుప్పంలో చంద్ర‌బాబు, మంగ‌ళ‌గిరిలో లోకేశ్ లీడ్‌లో ఉన్నారు. టీడీపీ – జ‌న‌సేన – బీజేపీ కూట‌మి 114కు పైగా స్థానాల్లో లీడ్‌లో ఉంది. వైఎస్సార్‌సీపీ కేవ‌లం 15 స్థానాల్లో మాత్ర‌మే లీడ్‌లో ఉంది.

Also Read:6ix సినిమాస్…’వాట్ ది ఫిష్’

 

- Advertisement -