కంటతడి పెట్టిన రోజా!

87
Roja
- Advertisement -

సినీ నటి,ఏపీ మంత్రి రోజా కంటతడి పెట్టారు. ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజా…జబర్దస్త్‌తో పాటు సినిమాలకు గుడ్ బై చెప్పారు. దీంతో ఆమెకు జబర్దస్త్ టీమ్ ఘనంగా వీడ్కోలు పార్టీ ఇచ్చింది. 13 ఏళ్లుగా జబర్దస్త్ కామెడీ షోతో తనకున్న అనుబంధం గురించి రోజా ఈ సందర్బంగా గుర్తుకు చేసుకున్నారు.

తాను జబర్దస్త్ షోలో ఉండగా రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించానని.. మంత్రి కూడా అయ్యానంటూ ఎమోషనల్ అయ్యారు. తనకు ప్రజాసేవ చేయడం చాలా ఇష్టమని.. తనను నమ్మి ఇలాంటి బాధ్యతను తనకు అప్పగించడంతో సంతోషంగా ఉందని రోజా తెలిపారు.

తనకు ఇంతకాలంగా సపోర్ట్ చేసిన జబర్దస్త్ షో నిర్వాహకులు, ఆర్టిస్టులు, మల్లెమాల యాజమాన్యానికి రోజా కృతజ్ఞతలు తెలిపారు. ఇన్నేళ్లుగా తమకు మద్దతునిచ్చిన రోజాను ఎప్పటికీ మరచిపోలేమని అన్నారు.

- Advertisement -