తిరుపతిలోని తుడా ఆఫీసులో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. కార్పొరేషన్ కు సంబంధించిన పెండింగ్ పనులపై సమీక్ష నిర్వహించారు. మున్సిపాలిటీల్లో ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నాం.. రాబోయే మూడేళ్లలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని అందిస్తాం అన్నారు.
ఏపీలోని 6 కేంద్రాల్లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ల ఏర్పాటు.. అక్టోబర్ 2 లోగా 85 లక్షల టన్నుల చెత్తను శుభ్రం చేస్తాం..గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పులను మిగిల్చింది.. నిధులు లేకపోయినా అన్ని పథకాలను అమలు చేస్తున్నాం.. ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నాం.. రాష్ట్రాన్ని అభివృద్ధివైపు నడిపిస్తున్నాం.. పరిశ్రమలు తెచ్చి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం.. తిరుపతిని మెగా సిటీగా మార్చే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు నారాయణ.
మరోవైపు ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం అయింది. *విజయవాడ వరలక్ష్మీనగర్‌లో మంత్రి నాదెండ్ల మనోహర్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాంకేతికత వినియోగంతో స్మార్ట్ రేషన్ కార్డులు తయారు చేశాం..వీటిలో క్యూఆర్ కోడ్ పొందుపరిచాం. రేషన్ తీసుకోగానే కేంద్ర, జిల్లా కార్యాలయాలకు సమాచారం అందుతుంది అన్నారు. 9 జిల్లాల్లో ఇవాళ ఇంటింటికీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నాం. 1.46 కోట్ల కుటుంబాలకు సెప్టెంబర్ 15 కల్లా కార్డులు అందిస్తాం అని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Also Read:బాన్సువాడలో పోచారం ఒంటరే!

