మూడేళ్లలో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తాం అన్నారు మంత్రి నారాయణ. సచివాలయంలో మీడియాతో మాట్లాడిన నారాయణ.. రాజధాని అమరావతిపై కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు..భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అనుమానాలు వద్దు అన్నారు.
రైతుల భూముల ధర నిలవాలన్నా.. పెరగాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి అన్నారు. విదేశాల నుంచి వచ్చి ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఫ్లైట్ కనెక్టివిటీ ఉండాలి..అందుకే అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం కట్టాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన అన్నారు.
స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి.. జనాభా పెరుగుతుంది..ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ లేదా భూసమీకరణ అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు..ఇప్పటికే అమరావతిలో పనులు ప్రారంభం అయ్యాయి అన్నారు. భూములిచ్చిన రైతు సోదరులకు ఎలాంటి అపోహ వద్దు…ఇచ్చిన మాట ప్రకారం అన్నీ చేస్తాం అన్నారు.
Also Read:పర్యావరణ హననం..తప్పించుకోలేరు: కేటీఆర్

