సింగపూర్ ప్రతినిధులతో నారాయణ

3
- Advertisement -

సింగపూర్ ల్యాండ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ ప్రతినిధులతో మంత్రి నారాయణ సమావేశం అయ్యారు. సింగపూర్ లో అమరావతి నిర్మాణ అంశాలపై మంత్రి నారాయణ అధ్యయనం చేశారు.

సింగపూర్ లో ఉపరితల రవాణా మౌలిక వసతులు చూస్తోంది ల్యాండ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ. ప్రజా రవాణా వ్యవస్థ, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్ ల ఏర్పాటు పర్యవేక్షించనుంది అథారిటీ.

అమరావతి రాజధానిలో రోడ్ ట్రాన్స్ పోర్టుపై సంస్థ ప్రతినిధులతో చర్చించారు మంత్రి. సింగపూర్ జేటీసీ పౌల్ట్రీ ప్రాసెసింగ్ హబ్ ను సందర్శించారు. చికెన్ ప్రాసెసింగ్, ప్యాకింగ్, డెలివరీ విధానాలను అధ్యయనం చేశారు. చికెన్ వ్యర్థాలను కూడా ఇతర ఉత్పత్తులను తయారుచేస్తోంది యూనిట్. శాస్త్రీయ పద్ధతిలో ప్రాసెస్ చేసే యూనిట్లను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది ప్రభుత్వం.

Also Read:న్యాయనిపుణులతో చర్చించి..నిర్ణయం:స్పీకర్

- Advertisement -