సినీ రంగానికి సహకరిస్తాం: ఏపీ మంత్రి

6
- Advertisement -

సినిమా రంగానికి సహకరించేందుకు సిద్ధమని ప్రకటించారు ఏపీ మంత్రి కందుల దుర్గేష్. రాష్ట్రంలో పర్యాటక, సాంస్కృతిక, సినిమా రంగాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ దిశగా స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు సాగుతామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో సినిమా నిర్మాణ కార్యకలాపాలు పెంచేందుకు మా నుండి అన్ని స‌హ‌య స‌హ‌కారాలు అందిస్తామ‌ని అన్నారు.

మా ప్ర‌భుత్వం వ‌చ్చాక సినిమా ప‌రిశ్ర‌మ‌కి అండ‌గా నిలుస్తున్నాం అని గుర్తు చేశారు. తెలుగు సినిమా పరిశ్రమ మన రాష్ట్రానికి గర్వకారణం, దానికి తగిన ప్రోత్సాహం అందించడం మా బాధ్యత అన్నారు. ప్ర‌తిసారి కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా స‌మ‌యంలోనే ఇలాంటి వివాదాలు సృష్టిస్తుంటారు.

సినిమా షూటింగ్‌లకు అనుమతులు సులభతరం చేయడం, సింగిల్ విండో విధానాన్ని మరింత పటిష్టం చేయడం, అలాగే రాష్ట్రంలో ఫిల్మ్ సిటీ నిర్మాణానికి సంబంధించిన అవకాశాలను పరిశీలిస్తామ‌ని ఈ సంద‌ర్భంగా అన్నారు. టిక్కెట్ రేట్స్‌పై ద‌శాబ్ధ‌కాలంగా వివాదం న‌డుస్తుంది. అయితే నిర్మాత‌లు టిక్కెట్ రేట్స్ పెంచ‌మ‌ని కోరిన‌ప్పుడు పెంచుతామ‌ని తెలియ‌జేశారు.

Also Read:హరిహర వీరమల్లు..లిరికల్ అప్‌డేట్!

- Advertisement -