జగన్‌కు షాక్…మంత్రి రాజీనామా

15
- Advertisement -

ఏపీ సీఎం జగన్‌కు షాక్ తగిలింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టికెట్లు రాని నేతలంతా పార్టీని వీడుతుండగా తాజాగా మంత్రే రాజీనామా చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన మంత్రి గుమ్మనూరు జయరాం వైసీపీ ప్రాధమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే, మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

మంగళగిరిలో టీడీపీ నిర్వహిస్తున్న జయహో బీసీ సభలో ఆ పార్టీ సభలో చేరనున్నట్లు తెలిపారు. సీఎం జగన్ ఏకపక్ష విధానాలతో అలసిపోయానని అందుకే పార్టీని వీడేందుకు సిద్ధమయ్యానని చెప్పారు. కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని అడిగారని అది తనకు ఇష్టం లేదన్నారు.

టీడీపీ తరపున గుంతకల్లు నుండి పోటీ చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయరెడ్డిలపై తీవ్ర విమర్శలు చేశారు. తాడేపల్లిలో ఇద్దరు పూజారులున్నారని వాళ్లు చెప్పిందే జగన్ చేస్తున్నారని ఆరోపించారు.

Also Read:ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రధాని

- Advertisement -